HOME » VIDEOS » Crime

Video : టీవీ నటి ఝాన్సీది ఆత్మహత్యా? హత్యా?... సూర్య పాత్ర ఎంత?

క్రైమ్12:31 PM February 06, 2019

Jhansi Death Case : వర్ధమాన టీవీ స్టార్ ఝాన్సీ మరణానికి ప్రేమ వ్యవహారమే కారణమని కుటుంబసభ్యులు తెలిపారు. దాంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం... ఝాన్సీ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఐతే... ఇది ఆత్మహత్యా? ప్రేరేపిత ఆత్మహత్యా? హత్యా? కుట్రపూరిత హత్యా? అనే కోణాల్లో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ఝాన్సీతో సూర్య అలియాస్ నాని అనే కుర్రాడు ప్రేమ వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. తన మరణానికి ముందు సూర్యతో వాట్సాప్‌లో ఝాన్సీ చాటింగ్ చేసింది. వాళ్లిద్దరూ చివరిసారి కలుసుకుని మాట్లాడుకున్న తర్వాతే ఝాన్సీ చనిపోయినట్లు తెలుస్తోంది. సూర్యతో మంగళవారం ఉదయం ఝాన్సీ, సూర్యల మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా... ఆమె మరణంతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని సూర్య చెప్పినట్లు తెలిసింది.

Krishna Kumar N

Top Stories