హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : రూ.2500 కోసం బీభత్సం... 8 మందికి గాయాలు, భారీగా ఆస్తి నష్టం

క్రైమ్15:52 PM April 30, 2019

గుంటూరు జిల్లా... సత్తెన పల్లి మండలం... గోగులపాటు గ్రామం. రాత్రి వరకూ బాగానే ఉంది. తెల్లారి చూస్తే అంతా అల్లకల్లోలం. అక్కడి దృశ్యాల్ని చూసిన వాళ్లకు భయం వేసే పరిస్థితి. నెక్ట్స్ ఏం జరుగుతుందో ననే టెన్షన్. కట్ చేస్తే... 8 మంది గాయాలపాలవ్వగా... భారీగా ఆస్తి నష్టం జరిగింది. విషయం పోలీసులకు తెలిసింది. వాళ్లు వచ్చి ఎంక్వైరీ చేశారు. జరిగిన నష్టాన్ని తెలుసుకుంటూ బాధితుల్ని పరామర్శించారు. అప్పుడు బాధితులు చెప్పింది విని పోలీసులు... అవునా... పేకాట వల్ల ఇంత అనర్థం జరిగిందా అని ఆశ్చర్యపోయారు. అసలేం జరిగిందంటే... దుర్గారావు, పోతురాజు ఒకప్పుడు పేకాట ఆడారు. దుర్గారావు లాస్ అయ్యాడు. అప్పు చేసి మరీ పేకాట ఆడాడు. ఆ క్రమంలో పోతురాజుకు రూ.2500 వేలు ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బులు ఎప్పుడు అడిగినా దుర్గారావు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇక లాభం లేదనుకున్న పోతురాజు కుటుంబం... దుర్గారావు కుటుంబాన్ని నిలదీసింది. డబ్బులు ఇవ్వకపోతే తాట తీస్తామని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. అందరి ముందూ తన పరువు పోయినట్లు భావించిన దుర్గారావు రివర్స్ స్కెచ్ వేశారు. అర్థరాత్రి దుర్గారావు తన కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి పోతురాజు కుటుంబ సభ్యుల అందరి ఇళ్లపైనా ఒకే టైంలో విరుచుకుపడ్డాడు. దాదాపు 30 మంది వెళ్లి... పోతురాజు కుటుంబ సభ్యుల కళ్ళలో కారం కొట్టి, కర్రలతో దాడి చేశారని బాధితులు పోలీసులకు తెలిపారు. ఇంట్లోని వస్తువులు, వంట సామాన్లు, టీవీలు, కూలర్లు, వాహనాలు, ఇళ్ల పైనున్న రేకులు అన్నీ నాశనం చేశారని వివరించారు. గాయపడిన వారికి సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ జరుగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి, యాక్షన్ మొదలుపెట్టారు. ఇదీ పేకాట వల్ల జరిగిన తీవ్రమైన అనర్థం.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading