ఒడిశాలోని గోపాపూర్లో ఆరుగురు వృద్ధులు చేతబడి చేస్తున్నారనే నెపంతో గ్రామస్తులు దాడి చేశారు. వారి పళ్లు ఊడగొట్టారు. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల సూరత్ నుంచి తిరిగివచ్చారు. నెల రోజుల్లో వారు హఠాన్మరణం చెందారు. చేతబడి వల్లే వారు చనిపోయారని గ్రామస్తులు ఆరోపించారు.