హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: నిజాం మ్యూజియంలో చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్

క్రైమ్16:24 PM September 11, 2018

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజాం మ్యూజియంలో చోరీ కేసు మిస్టరీ వీడింది. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు... చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ రాజేంద్రనగర్ వాసులు. మహ్మద్ గౌస్ పాషా, మహ్మద్ ముబీన్ దూరపు బంధువులు. పాతనేరస్తులు. ఓ రోజు నిజాం మ్యూజియంకు వెళ్లిన ముబీన్... తన స్నేహితుడు గౌస్ సాయంతో చోరీకి స్కెచ్చేశాడు. ఈ నెల 2న గోల్డ్ టిఫిన్ బాక్స్, గోల్డ్ కప్ సాసర్, గోల్డ్ స్పూన్ ఎత్తుకెళ్లారు. వాటిని ముంబైలో అమ్మేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నెల 10న ముంబై నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చినట్టు సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. మ్యూజియంలో కొట్టేసిన వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు.

webtech_news18