హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: కర్నూలు జిల్లా వెల్దుర్తి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం... 15 మంది మృతి...

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్దుర్తి క్రాస్ రోడ్డు సమీపంలో వోల్వో బస్సు, తుఫాన్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరింత కొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రమాదంలో మృతి చెందినవాళ్లంతా గద్వాలలోని శాంతి నగర్‌కు చెందినవారేనని గుర్తించారు. వేగంగా దూసుకువచ్చిన బైక్‌‌ను తప్పించబోయిన వోల్వో బస్సు... తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టినట్టు తెలుస్తోంది. మృతులంతా పెళ్లి చూపులకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కర్ణాటక వెళ్తున్న వోల్వో ప్రైవేట్ ట్రావెల్ బస్సు మితిమీరిన వేగంతో రావడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading