ముంబైలోని విఖ్రోలీ ఏరియాలో ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న వారిపై నుంచీ దూసుకెళ్లింది ఓ ఆయిల్ ట్యాంకర్. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా... మరొకరు గాయపడ్డారు. బాధితులంతా నిరుపేదలే. కనీసం తల దాచుకోవడానికి పూరిల్లు కూడా లేకపోవడంతో... ఫుట్‌పాత్‌పైనే బతుకుతున్నారని స్థానికుల ద్వారా తెలిసింది.