ఇది మనం ఊహించడానికి కూడా వీలుకాని, భరించలేని విషయం. ఈ దారుణం జరిగింది మహారాష్ట్రలోని భివాండీలో. మనలాంటి వాళ్లం... కూరగాయల షాపులకు వెళ్లి... తాజా కూరగాయలు ఇమ్మని అడుగుతాం. ఇలాంటి కొంత మంది వ్యాపారులేమో... ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యాపారి కూరగాయల బండి పక్కకు ఒరిగింది. దాంతో... టమాటాలు ఇతర కూరగాయలు డ్రైనేజీలో పడిపోయాయి. వాటిని తీసి తిరిగి గాయత్రీ నగర్ ఏరియాలో అమ్ముతున్నాడు. ఇది చూసిన స్థానికులు... వాటిని పారేయమని అడుగుతున్నారు. ఇప్పుడీ వీడియో వైరల్ అయ్యింది. అసలు మనం వాడుతున్నవి మంచి కూరగాయలేనా అన్న డౌట్ ఇప్పుడు మనకు రాకమానదు.