ఓ వివాదం చెలరేగడంతో ఇద్దరు పోలీసులు నడిరోడ్డుపై కొట్టుకున్న ఘటన యూపీలో చోటుచేసుకుంది. నలుగురు చూస్తున్నారన్న స్పృహ కోల్పోయిన కానిస్టేబుల్, హోం గార్డ్ ఒకరినొకరు పరస్పరం దుర్భాషలాడుకుంటూ, పరువు పోయేలా దెబ్బలాటకు దిగడంతో స్థానికంగా కలకలం రేగింది.