హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ముళ్ల పొదల్లో పసికందు.. భద్రాద్రిలో దారుణం

క్రైమ్20:06 PM November 14, 2019

బాలల దినోత్సవం రోజు సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో చోటుచేసుకుంది. అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామంలోని ఓ ముళ్ల పొదల్లో అప్పుడే పుట్టిన పసికందు లభ్యమైంది. ఆ శిశువు ఏడుపు విని అక్కడికి వెళ్లిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ బాబును గూడపర్తి సీతయ్య, స్వాతి దంపతులు దత్తత తీసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఐతే పోలీసులకు ఎదురు తిరిగిన గ్రామస్తులు.. శిశువును పిల్లలు లేని ఆ దంపతులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిడ్డకు అవసరమైన వైద్య సదుపాయాలు అందించి,ఆరోగ్య పరీక్షలు చేసి అప్పుడు చట్ట బద్ధంగా బిడ్డను అప్పజెపుతామని పోలీసులు హామీనివ్వడంతో గ్రామస్థులు శాంతించారు.

webtech_news18