ఇద్దరు మహిళలు కలిసి ఓ వృద్ధుడిని చితకబాదారు. పట్టపగలు నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే కిందపడేసి ఆయన్ను కొట్టారు. భూవివాదం విషయంలో ఆయనపై దాడిచేశారని స్థానికులు తెలిపారు. ఐతే అక్కడ అంత జరుగుతున్నా ఏ ఒక్కరూ ఆపే ప్రయత్నం చేయలేదు. హర్యానాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది.