దేశంలో గాని, దేశం బయటగాని, ఎర్రచందనానికి ఎంత డిమాండ్ వుందో తెలిసిందే. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాడానికి కొంత మంది, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎర్రచందనాన్ని దొంగిలిస్తున్నారు. ఆ ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోతున్నారు. అలాంటిదే ఇప్పుడు తిరుపతి శివార్లలో జరిగింది. ఈ దొంగలను పట్టుకొనే క్రమంలో దొంగలు పోలీసులు గాయపడుతున్నారు, ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కొన్ని ఘటనల్లో ఆమాయక ప్రజలు కూడా డబ్బులకు ఆశపడి ఈ స్మగ్లింగ్‌లో చిక్కుకోవడం వల్ల ప్రాణాలు వదిలేస్తున్నారు.