ఒడిశాలో ఓ బైక్ యాక్సిడెంట్ చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఓ బైక్ మీద ఇద్దరు యువకులు వెళ్తుండగా ఎదురు నుంచి వేగంగా వచ్చిన ఓ బైక్ వారిని ఢీకొట్టింది. ఆ ధాటికి వారంతా ఎగిరిపడ్డారు. కిందపడిన తర్వాత ఇరుగుపొరుగువారు వచ్చి లేపినా లేవలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారు.