హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. చావుబతుకుల్లో..

క్రైమ్20:22 PM October 12, 2019

తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కఠినంగా వ్యవహరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటనతో ఆవేదన చెందాడు. దీంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 90శాతం కాలిన గాయాలు కావడంతో బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి ఖమ్మం డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఖమ్మం నగరంలో కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ప్రకటనతో మనోవేదనకు గురై ఆత్మహత్యయత్నం చేశాడు.

webtech_news18