HOME » VIDEOS » Crime

Video : ఖమ్మంలో ఘోర ప్రమాదం.. స్కూల్‌లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్ ఒకరు మృతి

క్రైమ్16:43 PM February 24, 2020

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి ఓ ట్రాక్టర్ స్కూల్లోకి దూసుకెళ్లిదంది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన  మధిర మండలం రామచంద్రపురం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. ట్రాక్టర్ కింద పడి స్కూల్లో మధ్యాహ్నం భోజనం వండే డ్వాక్రా మహిళ మృతి చెందింది. దీంతో అక్కడున్న స్కూల్ పిల్లలంతా భయంతో పరుగులు తీశారు.మరోవైపు ప్రమాద విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాలకు పరగులు తీశారు. తమ పిల్లలు ఎలా ఉన్నారోనన్న భయాందోళనలు వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

webtech_news18

Top Stories