Vijayawada Crime: విజయవాడలోని సత్యనారాయణపురంలో ఉన్న శ్రీనగర్ కాలనీలో ఆకతాయిలు రెచ్చిపోయారు. ఓ ఇంటిముందు నిలిపి ఉంచిన రెండు బైక్లు, కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అర్ధరాత్రి బైక్పై వచ్చిన ముగ్గురు ఆకతాయిల్లో ఇద్దరు పెట్రోల్ పోసి నిప్పు అంటించి పరారయ్యారు. యజమానుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.