హోమ్ » వీడియోలు » క్రైమ్

VIDEO: హైదరాబాద్‌లో ముగ్గురు క్రికెట్ బుకీల అరెస్ట్

క్రీడలు08:42 PM IST Dec 28, 2018

హైదరాబాద్‌లో ఓ క్రికెట్ బెట్టింగ్ ముఠాను, ప్రధాన బుకీని పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కడపల్లికి చెందిన అలోక్ జైన్ (36) ఈ బెట్టింగ్ రాకెట్‌ను నిర్వహిస్తున్నాడు. అతడితోపాటు రామ్‌కోటికి చెందిన అభిషేక్ జైన్ (32), సికింద్రాబాద్‌కు చెందిన మెహుల్ కలసి ఈ బెట్టింగ్ మొదలు పెట్టారు. చిక్కడపల్లిలోని అలోక్ జైన్ నివాసంలో రూ.41.20లక్షల నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, ఒక సెట్ టాప్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలోక్ జైన్‌కు అమెరికాలో బెట్టింగ్‌లు నిర్వహించే సులేమాన్ సురానీ, ఐపీఎల్ మ్యాచ్‌‌ల సందర్భంగా బెట్టింగ్‌లు నిర్వహించే రాజస్థాన్‌కు చెందిన సుభాష్ అనే వ్యక్తితో పరిచయాలు ఉన్నాయి. వాటిని పెట్టుబడిగా పెట్టి ఈ ఆన్ లైన్ బెట్టింగ్ ప్రారంభించాడు. చివరకు పోలీసులకు దొరికిపోయారు.

webtech_news18