HOME » VIDEOS » Crime

Video : కామారెడ్డిలో దొంగల హల్ చల్.. ఏటీఎం చోరీకి యత్నం

క్రైమ్17:19 PM March 11, 2020

కామారెడ్డి జిల్లాలో ఏటీఎం చోరీకి దొంగలు ప్ర‌యాత్నించారు. షెట‌ర్ ను ద్వంసం చేసి ఏటిఎం నుంచి డ‌బ్బులు తీసెందుకు ప్ర‌య‌త్నం చేసి విఫ‌ల‌య్యారు.. పిట్లం మండల కేంద్రంలోని హైదరాబాద్ - నాందేడ్ ప్రధాన రహదారి పక్కన వినియోగదారుల అవసరాల నిమిత్తం డబ్బులు తీసుకునేందుకు ఇండిక్యాష్ ఏజెన్సీ వారు ఏటీఎంను ఏర్పాటు చేశారు. పగలంతా ఏటీఎంను తెరిచి లావాదేవీలు నిర్వహిస్తారు. రాత్రి కాగానే ఏటీఎం మూసివేస్తారు. ప్రతి రోజు మాదిరి గానే పగలంతా లావాదేవీలు నిర్వహించి రాత్రి మూసివేశారు. రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఏటీఎం షెట్టర్ ను గునపాలతో పైకి లేపి మిషన్ లో నుంచి డబ్బులుతీసుకుందుకు ప్రయత్నించారు. ఎంతకు ఏటీఎం తెరుచుకోకపోవడంతో మిషన్ ను పగులగొట్టి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో మిషన్ అక్కడే వదిలి పరారయ్యారు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘ‌ట‌న స్థలానికి చేరుకోని దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18

Top Stories