నిజామాబాద్‌లోని గుండారంలో మహాత్మాగాంధీ విగ్రహానికి మసి పూసిన అగంతకులు.. దేశ వ్యతిరేక నినాదాలతో కూడిన పేపర్ల దండ వేశారు. గాంధీ విగ్రహానికి నల్ల రంగు పూసి ఉన్నట్లు గమనించిన స్థానిక యువకులు, విగ్రహం మెడలో పేపర్ల దండ ఉన్నట్లు గుర్తించారు. దీంతో విగ్రహం వద్దకు వెళ్లి పరిశీలించగా, దేశ వ్యతిరేక నినాదాలతో కూడిన పేపర్ల దండ కనిపించింది. అందులో పాకిస్తాన్ జిందాబాద్.. ఇండియా డౌన్ డౌన్.. జిహాద్.. షాదుల్లాను విడుదల చేయాలి.. కాశ్మీర్ పాకిస్తాన్‌దే.. అంటూ తెల్ల కాగితాలపై రాసి ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.