బిహార్‌లోని పట్నాలో వింత ఘటన చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు ఆయుధాలతో ఓ టీవీల గోడౌన్‌లోని చొరబడి రూ.50 లక్షల విలువైన టీవీలను ఎత్తుకెళ్లారు. గేట్ వద్ద కాపలాగా ఉన్న వాచ్‌మెన్‌ను బంధించి షటర్ తెరిచి అందులో ఉన్న టీవీలను దోచుకెళ్లారు. ఈ తతంగమంతా సీసీటీవీలో రికార్డైంది.