కొమురం భీమ్ జిల్లా తిర్యాణి మండలంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎస్ కిరణ్ కుమార్ 32 గన్ను క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అవడంతో కిరణ్ కుమార్ తలకు తీవ్ర గాయమైంది. ఇది గమనించిన తోటి కానిస్టేబుల్ హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ కిరణ్ కుమార్ మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం చౌటుపల్లి వాసి. 13 బెటాలియన్ కి చెందిన కిరణ్ కుమార్ గత ఐదు నెలలుగా తిర్యాని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు.