శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ యువనేత ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. వైసీపీ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ శ్రీకాకుళం జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ తనయుడు అవినాష్ ఏకంగా పోలీస్‌స్టేషన్ భవనంపై నుంచి దూకేశాడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అవినాష్‌కు వేధింపులు ఎక్కువయ్యాయని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రతీ గొడవకు అవినాష్‌ను బాధ్యుడిని చేస్తూ ఎచ్చర్ల పోలీసులు కేసులు పెట్టారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. ఎస్సై రాజేష్ తనను వేధిస్తున్నారంటూ అవినాష్ తీవ్ర మనస్థాపం చెందాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.