హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: సవతుల కోట్లాట... తన భర్తను పెళ్లి చేసుకున్న మహిళపై మొదటి భార్య దాడి...

క్రైమ్19:54 PM February 08, 2019

జగిత్యాల జిల్లాలోని కథలాపూర్ మండలం కలికోట దగ్గర్లో ఉన్న తండాకు చెందిన దరావత్ రాజు అనే వివాహితుడు... పెళ్లై, విడాకులు తీసుకున్న సాయవ్వ అనే ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అందరికీ తెలియడంతో వారిద్దరూ గత నెలలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. తాను బతికి ఉండగానే సాయవ్వను పెళ్లి చేసుకున్నాడని... రాజు భార్య పూర్బన్ పగ పెంచుకుంది. ఆమె ఉన్న ఏరియా తెలుసుకుని కొడుకు మోహన్‌తో కలిసి దాడి చేసింది. వేములవాడ- కోరుట్ల హైవేలో ఉన్న ఇందిరాచౌక్ దగ్గర సాయవ్వ ఉన్నట్టుగా తెలుసుకున్న పూర్బన్ కుటుంబసభ్యులు... అక్కడి వెళ్లి ఆమెను చితకబాదారు. తన భర్తను లొంగదీసుకున్న సాయవ్వను చూడగానే తీవ్ర ఆవేశానికి లోనైన పూర్బన్... తాడుతో మెడకు ఉరిపెట్టి చంపేందుకు ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాన్ని గమనించిన స్థానికులు... సాయవ్వను కాపాడి పోలీసులకు సమాచారం అందించారు.

Chinthakindhi.Ramu