హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: జనగామలో విషాదం... బొమ్మకూరు రిజర్వాయర్‌లో మునిగి బావ, ఇద్దరు మరదళ్లు మృతి...

క్రైమ్19:08 PM June 01, 2019

జనగామ జిల్లాలోని అవినాశ్‌, అతని భార్య భార్గవి... ఆమె ఇద్దరు చెల్లెళ్లు సుమలత, సంగీత కలిసి... సరదాగా బొమ్మకూరు రిజర్వాయర్‌ వద్దకు వెళ్లారు. ఇద్దరు మరదళ్లతో కలిసి నీటిలో దిగాడు బావ అవినాశ్. అతని భార్య భార్గవి బయటే ఉండి... చెల్లెళ్లతో భర్త సరదాను మొబైల్‌లో వీడియో తీయడం మొదలెట్టింది. బావను ఆటపట్టిద్దామని మరదళ్లు... బావను ఎత్తి పడేయాలని చూశారు. అయితే లోతు ఎక్కువ ఉండడంతో అదుపు తప్పి ముగ్గురు నీటిలో మునిగిపోయారు. రిజర్వాయర్‌ నీటిలో మునిగిన ముగ్గురు ఒక్కసారిగా గల్లంతు కావడంతో కంగారుపడిన భార్గవి... వీడియో తీయడం ఆపేసి కేకలు వేసింది. ఆ కేకలు విన్న కొందరు స్థానికులు... సంఘటనా స్థలానికి చేరుకుని నీటిలో మునిగిన వారి కోసం గాలించారు. అయితే అప్పటికే ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు.

Chinthakindhi.Ramu