Indian Railways : హైదరాబాద్... నాంపల్లి రైల్వే స్టేషన్లో జరిగిందీ ఘటన. ఓ ప్రయాణికుడు... రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయి... జారిపోయాడు. రైలు కిందకు వెళ్లిపోబోయాడు. అంతలోనే అలర్టైన రైల్వే ప్రొటెషన్ ఫోర్స్ పోలీస్... అతన్ని ప్రాణాలకు తెగించి మరీ కాపాడారు. ఆ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.