నిత్యం విచక్షణ పాటిస్తూ ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులే.. ఒక్కోసారి తమ విచక్షణను కోల్పోతున్నారు. తాజాగా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చిన్న వివాదం విషయంలో ఎదుటి వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. వివరాల్లోకి వెళితే.. జీటీ ఎక్స్ ప్రెస్‌లో ఆర్పీఎఫ్‌కు చెందిన కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే క్రమంలో అదే రైలులో క్యాంటిన్ మేనేజర్‌గా సునీల్ సింగ్ పనిచేస్తున్నాడు. ఏదో ఒక విషయమై ఇద్దరి మధ్య చిన్న వివాదం చోటుచేసుకుంది. దీంతో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తన విచక్షణను కోల్పోయి సదరు క్యాంటిన్ మేనేజర్‌పై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన సునీల్ సింగ్‌కు ఖమ్మం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్ర అందించి హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటన వరంగల్ ఖమ్మం మధ్యలో చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.