HOME » VIDEOS » Crime

Video: మాస్కులు ధరించి, సినిమా ఫక్కీలో లలితా జ్యువెలర్స్‌లో దొంగతనం

క్రైమ్12:25 PM October 03, 2019

తమిళనాడులోని తిరుచ్చిలో లలితా జ్యువెలరీ షాప్‌కు కన్నం పెట్టిన ఇద్దరు దొంగలు పెద్ద మొత్తంలో నగలను ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. రూ.50 కోట్ల విలువైన 35 కేజీల బంగారం, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లిన దొంగలు.. డిస్‌ప్లేలలో ఉంచిన బంగారాన్నంతా కాజేశారు. అయితే, ఈ కేసులో పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. షాప్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. హాలీవుడ్ డార్క్ నైట్ సినిమాను తలపించేలా దొంగలు ముఖాలకు జంతువుల వింత మాస్కులు ధరించి చోరీకి పాల్పడ్డట్లు తేలింది. అర్ధరాత్రి 2 లేదా 3 గంటల ప్రాంతంలో చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దొంగల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

webtech_news18

Top Stories