హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి...

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో 65వ నంబరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ మండలంలోని సత్వార్ సమీపంలో సోలాపూర్ నుంచి హైదరాబాద్‌కు దానిమ్మ పళ్ళు లోడుతో వెళ్తున్న డిసిఎం వాహనాన్ని, జహీరాబాద్ వైపు నుంచి ముంబై వైపు వెళ్తున్న కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటేనర్‌లోని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా డిసిఎం డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతులు హైదరాబాద్‌లోని మెహిదీపట్నంకు చెందిన మొయిస్, మహమ్మద్ గౌస్‌గా గుర్తించారు పోలీసులు. కంటైనర్ డ్రైవర్ బండి వేగంగా వెళ్తున్న సమయంలో కునుకు తీయడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఎడమ వైపు వెళ్తున్న కంటైనర్ పది అడుగుల విస్తీర్ణంగల డివైడర్‌ను ఢీకొని డిసిఎం తోపాటు మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. మృతదేహాలను జహీరాబాద్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading