తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో కాల్పుల వ్యవహారం కలకలం రేపాయి. ధర్మారం మండలం సాయంపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ బద్ధం తిరుమల్ రెడ్డి గాలిలోకి కాల్పులు జరపడంతో గ్రామంలో ఒక్కసారి భయాందోళనలు రేపింది. అర్ధరాత్రి పెళ్లి భారత్లో గొడవకు దారితీసిన అనంతరం బద్ధం తిరుమల్ రెడ్డి తన తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో గ్రామస్థులకు అసలు ఏం జరిగిందో అర్థంకాలేదు. కొందరు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావడంతో... తెల్లవారుజామున పోలీసులు రంగంలోకి దిగారు. తిరుమల్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అతడిని పెద్దపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు.