HOME » VIDEOS » Crime

Video: తీగలో బంగారం...శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టివేత

క్రైమ్15:34 PM March 13, 2020

శంషాబాద్‌ విమానాశ్రయంలో గురువారం ఓ ప్రయాణికుడి నుండి 1382 గ్రాముల బంగారం కస్టమ్స్‌ అధికారులకు పట్టుబడటంతో భద్రతాధికారులు విస్తుపోయారు. రాజస్థాన్‌కు చెందిన శుభ్‌కరన్‌ గతంలో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు వెళ్లాడు. స్వదేశానికి వస్తున్న క్రమంలో 1382 గ్రాముల బంగారాన్ని కరిగించి తీగల రూపంలో మార్చి పైన వెండిపూత పూయించాడు. తన సామగ్రిలో రహస్యంగా పెట్టుకుని ఫ్లైనాస్‌ ఎయిర్‌లైన్స్‌ ఎక్స్‌వై-325 గల విమానంలో ఎక్కి శంషాబాద్‌లో దిగాడు. కస్టమ్స్‌ అధికారులు ప్రయాణికుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా రూ.60.21 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18

Top Stories