ఈ అపచారం జరిగింది తెలంగాణ... హుజూర్నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండలంలో. జాగారంలో నిద్ర రాకుండా ఉండాలంటే... ఏవో ఒక ప్రోగ్రామ్స్ నిర్వహించాలనుకున్న కొందరు... రికార్డు డాన్సులను నిర్వహించారు. కొందరు వీటిని ఎంజాయ్ చేశారు. మరికొందరు తిట్టిపోశారు. ఎంతో భక్తి రసంతో జరుపుకోవాల్సిన జాగారంలో... ఈ రక్తి రసమేంటని మండిపడ్డారు. విషయం పోలీసులకు తెలిసింది. పరిశీలిస్తామని చెప్పారు.