ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో ఎన్నికల కవరేజీ కోసం వెళ్లిన దూరదర్శన్ కెమెరామన్ అచ్యుతానంద సాహు కుటుంబానికి అండగా ఉంటామని కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తెలిపారు. ప్రమాదకర పరిస్థితులు ఉంటాయని తెలిసినా మీడియా ప్రతినిధులు చూపుతున్న ధైర్యసాహసాలను ఆయన అభినందించారు. ఇలాంటి వారి త్యాగాలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటామన్నారు.