హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : భార్యాభర్తల మధ్య గొడవ... ప్రాణాలు కోల్పోయిన రెండేళ్ల చిన్నారి...

క్రైమ్12:47 PM April 06, 2019

నిర్మల్ జిల్లా బాసరలో భార్యా భర్త మధ్య జరిగిన గొడవ చిన్నారి ప్రాణం తీసింది. భార్యతో భర్త గొడవ పడుతుండగా... ఆమె చేతిలో ఉన్న రెండేళ్ల చిన్నారి రాధిక... జారి కిందపడిపోయింది. పైకి ఏ గాయాలూ కాకపోయినా... లోపల ఏదో తేడా వచ్చింది. చిన్నారి దాదాపు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అది గమనించని తల్లి... ఆ పాపను నాన్నమ్మ దగ్గర ఉంచింది. భైంసా ఆసుపత్రిలో తనకు చికిత్స కోసం వెళ్లింది. తిరిగి రాత్రికి ఇంటికొచ్చిన ఆమె... అలసిపోయి నిద్రపోయింది. తెల్లారి లేచాక చూస్తే... రాధిక విగతజీవిగా కనిపించింది. ఉలుకూ, పలుకూ లేదు. పాపను ఎంత కదిపినా కదలలేదు. అంతే ఆ తల్లి గుండె ఆగిపోయినంతపనైంది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాసర పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు. మహారాష్ట్రకు చెందిన గణేష్ దంపతులు... కొన్నేళ్ల కిందటే బాసర వచ్చారు. ఇక్కడ ఇనుప వస్తువులు తయారుచేస్తూ... జీవిస్తున్నారు. చిన్నారి మరణం ఆ కుటుంబాన్ని కన్నీటి సంద్రంలో ముంచేసింది.

Krishna Kumar N