వైద్యుల నిర్లక్ష్యంతో జగిత్యాలలో ఓ బాలింత చనిపోయింది. కోరుట్ల ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి అగుల్లా జ్యోతి (23) మృతి చెందింది. తల్లి మృతితో నవజాత శిశువు అనాథటా మారిపోయింది. ఈ పాప పరిస్థితిని చూసి స్థానికులు కంటతడిపెట్టారు. తమకు న్యాయం చేయాలని మృతదేహంతో ఆసుపత్రి ముందు మృతురాలి బంధువులు ధర్నా చేశారు.