ఢిల్లీలో పట్టపగలు నడిరోడ్డుపైనే దారుణం జరిగింది. నరేంద్ర అనే వ్యాపారవేత్తను గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపాడు. అతడు కార్లో కూర్చున్న సమయంలో తుపాకితో కాల్చాడు. నరేంద్ర కారు నుంచి దిగి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ గ్యాంగ్స్టర్ వెంటపడి మరీ కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలపాలైన వ్యాపారవేత్త అక్కడికక్కడే చనిపోయాడు. ద్వారక ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.