హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : ఖమ్మం జిల్లాలో బస్సు బోల్తా... ఒకరు మృతి... ఏడుగురికి గాయాలు

క్రైమ్09:23 AM October 21, 2019

Bus Accident in Khammam : ఖమ్మం జిల్లా... కొణిజర్ల మండలం... లక్ష్మీపురం గ్రామంలో సాయికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిట్టిబాబు అనే ప్రయాణికుడు చనిపోగా... ఏడుగురికి గాయాలయ్యాయి. వారందర్నీ దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్చారు. వారంతా ఖమ్మం జిల్లాకు చెందిన వారిగా తెలిసింది. ఈ బస్సు తెల్లవారుజామున హైదరాబాద్ నుంచీ బయల్దేరింది. బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇది కొణిజర్ల మండలం... లక్ష్మీపురం గ్రామంలో వెళ్తుండగా... అక్కడ ఓ మలుపు ఉంది. అది సరిగా చూసుకోని డ్రైవర్... బస్సును వంకరగా తిప్పడంతో... అది ఓ పక్కకు ఒరిగిపోయింది. ఒక్కసారిగా బోల్తా పడింది. అంతే... నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు తప్పించుకునే ఆలోచనకు కూడా రాకముందే... ప్రమాదం జరిగిపోయింది. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు... చనిపోయిన ప్రయాణికుణ్ని ఖమ్మం జిల్లాకు చెందిన చిట్టిబాబుగా గుర్తించారు. అటు... ఆస్పత్రిలో చేర్చిన ప్రయాణికులకు ప్రమాదం లేదని, వారంతా కోలుకుంటారని డాక్టర్లు తెలపడం ఒకింత ఉపశమనం అనుకోవచ్చు. ప్రస్తుతం ప్రయాణికులందర్నీ వేరే వాహనాల్లో గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. పోలీసులు కేసు రాసి దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18