హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : ఎల్బీనగర్‌లో ప్రైవేట్ ఆస్పత్రి సీజ్... చిన్నారి మరణంపై ప్రభుత్వం సీరియస్

క్రైమ్13:08 PM October 21, 2019

Fire Accident in Hospital : ఎల్బీనగర్‌లో అగ్నిప్రమాదం జరిగిన ప్రైవేట్ ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. ఈ ఆస్పత్రి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నేటి ఉదయం ICU విభాగంలో రకరకాల కరెంటు వైర్లు ఎక్కువై... తేడా వచ్చి... ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో... పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. పొగకు ఊపిరి ఆడక ఓ చిన్నారి చనిపోయింది. మరో ఐదుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. ICUలోని చిన్నారులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసింది. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది... ఆస్పత్రి ICU అద్దాలు పగలగొట్టి... మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కి ఎదురుగానే ఈ ఆస్పత్రి ఉంది. ఆస్పత్రిని మూసివేసిన పోలీసులు... ICUలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు... అలర్ట్ అలారం ఎందుకు మోగలేదని ప్రశ్నించారు. ఓ స్థానిక కార్పొరేటర్ అండతో ఇది నడుస్తున్నట్లు గుర్తించారు. ICU విభాగం పూర్తిగా కాలిపోయింది. చిన్నారి చనిపోవడంతో... ఆ పాప తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

webtech_news18