HOME » VIDEOS » Crime

Video: నల్లమలలో మహిళ హత్య కేసులో సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్

క్రైమ్ న్యూస్15:18 PM February 07, 2020

Nallamala Woman Murder Case : మట్కాస్వామి... శ్రీశైలం దర్శనానికి వచ్చిన మహారాష్ట్రకు చెందిన మహిళతో మంచివాడిలా మాట్లాడుతూ నాటకాలాడాడు. నల్లమలలో దర్శించుకోవాల్సిన స్థలాలు చాలా ఉన్నాయి అన్నాడు. అవన్నీ తనకు తెలుసన్నాడు. తాను చూపిస్తానన్నాడు. అతని నిజస్వరూపం తెలియని ఆమె సరే అంది. అలా... శ్రీశైలం నుంచీ సున్నిపెంటకు కమాండర్ జీపులో ఆమెతో ప్రయాణించాడు. అక్కడి నుంచీ అక్క మహాదేవి గుహల మార్గంలో 4 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఆమె దురదృష్టం కొద్దీ ఆ రోజు అటుగా వెళ్లే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. రామకృష్ణను నమ్మి అతని వెంట బయలుదేరింది. మార్గ మధ్యలో ఎవరూ లేని టైమ్ చూసి... ఆమెపై క్రూరమృగంలా ఉరికాడు. ఆమె తప్పించుకోలేని పరిస్థితుల్లో రేప్ చేశాడు. ఆమె బతికి ఉంటే విషయం అందరికీ చెబుతుందని అనుకొని... నిమ్మకాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోశాడు. తనను చంపవద్దని ఆమె ఎంతగానో వేడుకున్నా ఆ దుర్మార్గుడు వెనక్కి తగ్గలేదు. ఆమె చనిపోయిందని డిసైడయ్యాక... ఆమె బ్యాగ్, సెల్‌ఫోన్‌ని పక్కనున్న పొదల్లోకి విసిరేశాడు. తన విషయం ఎవరికీ తెలియదులే అనుకొని పారిపోయాడు. ఐతే... రామకృష్ణకు తెలియని సీక్రెట్ ఏంటంటే... ఆ అడవుల్లో చాలా చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిలో ఆమె రామకృష్ణ వెంట వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ కొండెగాడు ఎవడా అని ఆరా తీశారు. జీపు వాళ్లను అడగ్గా కొంత డేటా తెలిసింది. శ్రీశైలంలో చెక్ చెయ్యగా మరిన్ని వివరాలు తెలిశాయి. అలా అతన్ని పట్టుకొని కటకటాల వెనక్కు నెట్టారు. ఇలాంటి కేటుగాళ్ల వల్లే... ఇతర రాష్ట్రాల నుంచీ తెలుగు రాష్ట్రాలకు వస్తున్న భక్తులు... రావాలంటే భయపడుతున్నారు. ఈ ఘటనతో పోలీసులు ఇలాంటి అడవి మార్గాల్లో మరిన్ని అదనపు భద్రతా చర్యలు తీసుకోవాలని డిసైడయ్యారు.

webtech_news18

Top Stories