HOME » VIDEOS » Crime

Video : ఖమ్మం జిల్లాలో అక్రమ మద్యం పట్టివేత..

21 రోజుల లాక్ డౌన్ సందర్భంగా దేశ వ్యాప్తంగా వ్యాపార సంస్థలన్నీ బంద్ అయ్యాయి. వీటితో పాటు వైన్ షాపులు కూడా బంద్ అయ్యాయి. దీంతో మందుబాబులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే వీరి బలహీనతను ఆసరా చేసుకొని కొందరు అక్రమ వ్యాపారులు పెద్ద ఎత్తున వ్యాపారానికి తెర లేపారు. తాజాగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో నాలమాద ఉప్పలయ్య అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తూ పట్టుబడ్డాడు.అక్రమంగా మద్యం అమ్ముతున్నాడనే విషయం తెలుసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడ ఇంటి లోపల మద్యం ఉన్నట్లు వారు గుర్తించారు. నిబంధనలు అతిక్రమించి పాలేరులో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్న ఇద్దరిని టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు, సిఐ రవి కుమార్ అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ,,66,000/- విలువ గల మద్యం సీసాలను సీజ్ చేశారు.

webtech_news18

Top Stories