హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: కాలేజ్‌లోనే మెడికల్ విద్యార్థులపై కానిస్టేబుల్ దౌర్జన్యం... జట్టు పట్టుకుని లాక్కెళ్లి...

ఆంధ్రప్రదేశ్04:37 PM IST May 06, 2019

ఏలూరు సమీపంలోని ఆశ్రం కాలేజీలో మెడికల్ కాలేజ్ విద్యార్థులు... తమ వేసవి సెలవులు పెంచాలంటూ డిమాండ్ చేస్తూ తరగతులు బహిష్కరించి, ఆందోళనలకు దిగారు. దీంతో ఆశ్రం కాలేజ్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల చెంతకు విద్యార్థులు గుంపుగా వచ్చి, తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో ఓ కానిస్టేబుల్ మొబైల్‌లో విద్యార్థుల వీడియోను తీయడం మొదలెట్టాడు. దానికి అభ్యంతరం వ్యక్తం చేసిన ఓ విద్యార్థిని... కానిస్టేబుల్ నుంచి మొబైల్ లాక్కుంది. అయితే ఈ హఠాత్ పరిణామంతో కోపంతో ఊగిపోయిన పోలీస్ కానిస్టేబుల్... సదరు విద్యార్థినిని జట్టు పట్టుకుని లాక్కెళ్లాడు. విద్యార్థులంతా కానిస్టేబుల్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినా వీలు కాలేదు. ఆమెను బలవంతంగా పట్టుకుని, ప్రిన్సిపాల్ రూమ్‌కు తీసుకెళ్లిన కానిస్టేబుల్... జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. అయితే ఆమె కేసు పెడితే తన ఉద్యోగం పోతుందనే భయంతో ఆమెపైనే ఫిర్యాదు చేశాడు.

Chinthakindhi.Ramu