కరీంనగర్ కెనాల్లో మరో కారు లభ్యమైంది. తిమ్మాపూర్ మండలం అలుగునూర్ కాకతీయ కెనాల్ లో ఓ కారు కొట్టుకు వచ్చింది. వెంటనే కారును బయటకు తీసిన పోలీసులు కారులో ముగ్గురు మృతదేహాల్ని కూడా గుర్తించారు. కారు నెంబర్‌ను ప్లేట్‌ను బట్టి ప్రమాదానికి గురైంది పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కారుగా గుర్తించారు. కారులో కుళ్లిపోయిన స్థితిలో మూడు మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు.