అక్కడ పెళ్లి వేడుక జరుగుతోంది. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నామని వధూవరులు సంతోషంతో మురిసిపోతున్నారు. అలాంటి పెళ్లి వేడుకలో అనుకోకుండా విషాదం జరిగింది. పెళ్లి జరిపిస్తున్న పాస్టర్ ఎలీషా సామవేదం ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్లో మే 22న జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.