తమిళనాడులోని క్రిష్టగిరి టోల్ ప్లాజా నిన్నటివరకూ ఉండేది. ఒక్కసారిగా అది మాయమైంది. కారణం ఓ ట్రక్కు డ్రైవర్. నిర్లక్ష్యంగా ట్రక్ నడిపిన ఆ డ్రైవర్... టోల్ ప్లాజా గేటు, దాని పక్కన టోల్ వసూలు చేసేందుకు ఏర్పాటుచేసిన తాత్కాలిక కేంద్రాన్ని కూడా ట్రక్కుతో గుద్దుకుంటూ వెళ్లాడు. అదే సమయంలో సైడ్ నుంచీ వెళ్తున్న బైకర్‌ను ఢీకొట్టడంతో... బైక్ డ్రైవర్... ట్రక్కు కింద పడి... ప్రాణాలు కోల్పోయాడు. రాష్ డ్రైవింగ్ ఎంత డేంజరే ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.