ఆదిలాబాద్ జిల్లా నేరెడిగొండ టోల్ ప్లాజ సమీపంలో రన్నింగ్ కార్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిర్మల్ నుంచి ఆనంద్ అనే వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి కారులో ఆదిలాబాద్ వెళుతున్నాడు. టోల్ ప్లాజ దాటగానే కారు ముందు భాగం నుంచి మంటలు రావడం గమనించిన ఆనంద్ అప్రమత్తం అయి కుటుంబ సభ్యులు ను కారు దింపడంతో ప్రాణాపాయం తప్పింది.రన్నింగ్ కార్ లో ఒక్కసారిగా మంటలు రావడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తంతో కారులో ఉన్నవారంత సేఫ్ గా బయటపడ్డారు.