హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: నకిలీ ఏజెంట్ల వల్ల లక్షల్లో నష్టపోయాం... న్యాయం చేయండి...

క్రైమ్04:35 PM IST Dec 24, 2018

పొట్టకూటి కోసం ఉద్యోగాన్ని వెతుక్కుంటూ గల్ఫ్ దేశాలకు వెళ్తున్నవారికి... అక్కడ కష్టాలు తప్పడం లేదని బాధితులు వాపోయారు. తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్ పరిధిలో వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు ఆరుగురు యువకులు... నకిలీ ఏజెంట్ల కారణంగా మోసపోయారని ఆరోపిస్తూ... నిజామాబాద్ ఇంఛార్జ్ పోలీస్ కమిషనర్ శ్రీధర్‌రెడ్డి, గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం ప్రతినిధి బసంత్ రెడ్డికి లిఖితపూర్వకంగా విన్నవించుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన దండు నారాయణ, మహ్మద్ ఆన్వర్ అనే నకిలీ ఏజెంట్లు... ఏడు లక్షలు తీసుకుని గల్ఫ్‌కి పంపించారని... అయితే వర్క్ పర్మిట్ లేకపోవడంతో యువకులను తిరిగి స్వదేశానికి పంపించేశారని వారు తమ గోడు వెల్లబుచ్చుకున్నారు.

Chinthakindhi.Ramu