హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అసభ్య ఫోటోలు... యువకుడిని చితకబాదిన అక్కాచెల్లెలు...

క్రైమ్13:43 PM May 18, 2019

నిర్మల్ ఏరియాకుచెందిన అనిల్ అనే యువకుడు...ఓ వివాహితకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. కూల్‌డ్రింక్ తాగి, స్పృహ తప్పిపోయిన ఆమె అసభ్యకరంగా ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టాడు. పక్కనే ఉన్న వివాహిత భర్త చెల్లెలు ఈ పనికి అనిల్‌కు సహకరించడం విశేషం. మహిళ చెప్పినట్టు వినకపోవడంతో ఆగ్రహానికి లోనైన అనిల్... ఆ ఫోటోలను ఆమె భర్తకు పంపాడు. వేరే వ్యక్తితో అసభ్యంగా, చనువుగా ఉన్నట్టుగా తీసిన ఫోటోలను చూసిన సదరు మహిళ భర్త... యువతిని ఇంట్లో నుంచి గెంటేశాడు. ఆమె ఒంటరిగా ఉంటున్న విషయం తెలుసుకున్న అనిల్... యువతి దగ్గరికి వచ్చి, తనతో రావాలంటూ బలవంతం చేయబోయాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన ఆమె, తన చెల్లెలితో కలిసి అతన్ని చితకబాదింది. చుట్టుపక్కల వాళ్లు కూడా జరిగింది తెలుసుకుని, ఈ సోదరులకు సహకరించారు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు... అనిల్‌ను అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Chinthakindhi.Ramu