హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్‌లో విషాదం... పై నుంచీ పడి ప్రాణాలు కోల్పోయిన బాలిక

క్రైమ్14:00 PM June 13, 2019

వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు ప్రారంభమైన రెండో రోజే విషాదం. స్కూల్‌కు వెళ్లిన బాలిక వినీత భవనంపై నుంచి కింద పడి చనిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ నాగోల్‌ సాయినగర్‌లో జరిగింది. నాగోల్ నాగార్జున స్కూల్‌లో వినీత... తొమ్మిదో తరగతి చదువుతోంది. నిన్నే స్కూల్ తెరుచుకోవడంతో.. అందరిలాగా... వినీత కూడా పొద్దున్న లేచి స్కూల్‌కు వెళ్లింది. స్కూల్‌లోని నాల్గోవ అంతస్తు ఎక్కుతున్న క్రమంలో వినీత కింద పడింది. దీంతో వెంటనే ఆమెను గుర్తించిన స్థానికులు, స్కూల్ సిబ్బంద హుటాహుటిన పక్కనే ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వినీత మృతి చెందింది. దీంతో బాలిక తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Krishna Kumar N