త్రిపురలో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వివిధ ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో ఈ డ్రగ్స్ పట్టుబడ్డాయి. వీటి విలువ సుమారుగా నాలుగు కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ డ్రగ్స్‌ను దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు సరఫరా చేస్తున్నారని అధికారులు తెలిపారు.