లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడో ప్రభుత్వ ఉద్యోగి. గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మార్వో ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఖాశీం బర్త్ డే సర్టిఫికెట్ కోసం విద్యార్థుల నుంచి రూ.5వేలు డిమాండ్ చేశాడు. విద్యార్థులు బతిమిలాడటంతో రూ.2వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మొత్తాన్ని విద్యార్థుల నుంచి తీసుకుంటుండగా కెమెరాకి దొరికిపోయాడు.