హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : 500 మందికి పైగా ఎయిడ్స్ అంటించాడు... పాకిస్థాన్‌లో ఓ డాక్టర్ నిర్వాకం...

క్రైమ్11:56 AM May 17, 2019

దక్షిణ పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఉన్న వసాయో గ్రామం HIV ఆందోళనతో వణుకుతోంది. అక్కడ ఇప్పటికే 500 మందికి HIV Aids సోకినట్లు పరీక్షల్లో తేలింది. ఇంకా ఎవరెవరికి HIV సోకిందోనని అందరూ ఆందోళనతో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. దీనంతటికీ కారణం అక్కడి ఓ డాక్టర్. HIV వ్యాధిగ్రస్థుడికి వాడిన సిరంజిని పారేయకుండా దాచి... దానితో వందల మందికి ఇంజెక్షన్లు చేశాడు. ఫలితంగా చాలా మందికి HIV సోకింది. ఈ విషయం వైరల్ అవ్వడంతో... పోలీసులు ఆ గ్రామాల్లో 5 స్క్రీనింగ్ రూంలను ఏర్పాటు చేసి... నెల నుంచీ HIV టెస్టులు చేయిస్తున్నారు. ఇప్పటివరకూ 500 మందికి పైగా HIV సోకినట్లు డాక్టర్లు తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులున్నారు. సరిగా శుభ్రం చెయ్యని వైద్య పరికరాల్నీ, సిరంజులను మళ్లీ మళ్లీ వాడటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వారు అంచనాకొచ్చారు. దీనంతటికీ కారణమైన డాక్టర్‌ను ఉరి తియ్యాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Krishna Kumar N