HOME » VIDEOS » Crime

Video : అమీన్‌పూర్‌లో దారుణం.. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

క్రైమ్17:58 PM January 23, 2020

సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ పీఎస్ పరిధిలో దారుణం వెలుగుచూసింది . 16 సంవత్సరాల మైనర్ బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వెలుగు చూసింది. స్థానిక చక్రపురి కాలనీలో బాలికను ఓ షాప్ వద్ద బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేసి, ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మద్యం తాగి దుండగులు అత్యాచారం చేసినట్లు ప్రాథమిక సమాచారంగా తెలుస్తోంది. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించగా,  సెల్ ఫోన్ ఆధారంగా బాలిక ఆచూకీని పసిగట్టి, ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలంలో కొన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

webtech_news18

Top Stories